హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): ‘మీ ఏజెంట్ పాలిస్తేనే ఇలా ఉన్నదంటే.. ఇక నేరుగా మీరే పాలిస్తే దొంగకు తాళాలిచ్చినట్టే’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రముఖ వాగ్గేయకారుడు దేశపతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అరవై ఏండ్ల పాటు తెలంగాణ సంపదను దోచుకున్న గద్దలు మళ్లీ వాలుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో అడుగుపెట్టేందుకు 2018 ఎన్నికల్లో చంద్రబాబు ప్రయత్నిస్తే ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని, నేరుగా వస్తే ఓడిస్తున్నారని, రే వంత్‌రెడ్డి అనే ఏజెంట్ ద్వారా మళ్లీ రావాలని కు ట్రలు పన్నారని ఆరోపించారు. తమ ఎజెండా అమలులో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ప్రెస్‌మీట్ పేరుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ బహిరంగ సభ తరహాలో మాట్లాడారని మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యా ణ్ వ్యాఖ్యలపై ఓ టీవీ డిబేట్లో దేశపతి స్పందించారు.
అరవై ఏండ్లు నీళ్లు, నిధులు దోచుకుపోయి మళ్లీ వచ్చి నవనిర్మాణం పేరుతో నీతులు చెప్తే ఎలా నమ్మాలి? అని దేశపతి ప్రశ్నించారు. ఇప్పటికే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను దోచుకుంటున్నారని, ఒకవేళ మళ్లీ మీరు పాలన చేపడితే తెలంగాణ సంపద ఉంటుందా? దొంగలకు తాళంచెవులు ఇచ్చినట్టు కాదా? అని ప్రశ్నించారు. వందల మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకు న్నదే స్వయంపాలన కోసమని.. తెలంగాణ పచ్చగా ఉంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని, అప్పడే తెలంగాణపై దండయాత్ర చేయా ల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ విషయంలో చిరంజీవి ఎలాంటి స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదని గుర్తుచేశారు. ఒకరు జై తెలంగాణ, మరొకరు నై తెలంగాణ అనడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని విమర్శించారు. నాడు లగడపాటి రాజగోపాల్ నై తెలంగాణ అంటే, పొన్నం ప్రభాకర్ జై తెలంగాణ అన్నారని, ఇప్పుడు కేవలం క్యారెక్టర్లు మారారని ఆరోపించారు. రావ చ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవ చ్చు అన్నం కాదా.. అమ్ముకున్నారు కా దా? ఇంకా ఏం కావాలి? మళ్లీ సెక్రటేరియట్లో చక్రం తిప్పుతారా? అని ప్రశ్నించారు.
పవన్‌కు చరిత్ర, సమాజం, భిన్న సంస్కృతులపై సరైన అవగాహన లేదని దేశపతి విమర్శించారు. కేవలం సినిమాల్లో డైలాగ్‌లు చెప్పినంత సులువుగా సమాజంలో భావోద్వేగాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. సినీగ్లామర్‌తో రాజకీయాల్లోకి రావచ్చు కానీ, బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. భారతదేశం లౌకిక దేశమని, ఇకడ అన్ని మతాల వారికి సమాన హకులుంటాయని చెప్పారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఒకే వర్గాన్ని లేదా ఒకే సిద్ధాంతాన్ని రుద్దాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేశారు. పవన్ హఠాత్తుగా సనాతన ధర్మం, జాతీయవాదం వ్యాఖ్యల వెనుక కేవలం రాజకీయ ప్రయోజనాలు, బీజేపీ లైన్‌ను ఫాలో అవ్వడమే ఉన్నదని విమర్శించారు. ధర్మం అంటే సమాజంలో శాంతి, సోదరభావాన్ని నెలకొల్పడం అని, కానీ పవన్ వ్యాఖ్యలు సమాజంలో విభజన తెచ్చేలా ఉన్నాయని మండిపడ్డారు.