MLC Counting | ‘వరంగల్-ఖమ్మం-నల్గొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం 96 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు, చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన 2 లక్షల 40 వేల 13 ఓట్ల లెక్కింపునకు తెల్లవారుజామున వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
కాగా, 96 వేల మొదటి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ పడుతున్నారు. కాగా మొదటి ప్రాధాన్య ఓట్లలో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జై మల్లన్న అంటూ బ్యాలెట్ పేపర్ మీద రాయడంతో చెల్లకుండా పోయినట్లు సమాచారం.