హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గత నెల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధిరేటు ‘సున్నా’కు చేరడం ప్రమాద సంకేతమని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ హెచ్చరించారు. రాష్ట్ర రాబడి పెరగకుంటే అభివృద్ధి పనులు చేపట్టడం కష్టమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదాయం రాకపోతే ఏమీ చేయలేమ ని పేర్కొంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని, పెట్టుబడిదారులకు భరోసా కల్పించాలని సూచించారు. ‘తెలంగాణ ఆర్థిక ప్రగతి-2025-26 బడ్జెట్’ అనే అంశంపై శనివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) నిర్వహించిన రౌడ్ టేబుల్ సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్మాణం కోసం రూ.2-3 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ అది ఇప్పుడు రూ.30 లక్షల కోట్ల ఆస్తిగా మారిందని చెప్పారు.
గత పదేండ్లుగా జీఎస్టీ వసూళ్లలో ఢిల్లీ తర్వాత మన రాష్ట్రమే ముందుండేదని గుర్తుచేశారు. ‘హైడ్రా’ను రంగంలోకి దింపి ఇండ్లను కూల్చివేయడంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని, దీంతో ఇండ్లు, ప్లాట్ల క్రయవిక్రయా లు భారీగా క్షీణించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంతోపాటు ఇతర రాబడి పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. తెలంగాణ దివాలా తీసిందని సీఎం రేవంత్‌రెడ్డే ప్రకటిస్తే ఇక రాష్ర్టానికి ఎవరు అప్పు ఇస్తారని ప్రశ్నించారు.
వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఉం డాలని ఆర్థిక నిపుణుడు పులి రాజు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని రైతుల్లో 88% మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాబడిలో 60% రెవెన్యూ ఖర్చులకే పోతున్నాయని, సంక్షేమానికి 40% నిధులు మాత్రమే మిగులుతున్నాయని ప్రొఫెసర్ కే సీతారామారావు చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో కేటాయింపులు జరపాలని ప్రొఫెసర్ రమణమూర్తి సూచించారు. బడ్జెట్ పదాలను బ్రహ్మపదార్థంలా జఠిలంగా, అర్థకాని విధంగా మార్చేశారని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణకుమార్ పేర్కొంటూ.. వాటిని సరళీకరించాలని, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్‌ను రూపొందించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైతు సం ఘం రాష్ట్ర కార్యదర్శి మూడు శోభన్, ప్రొఫెసర్ సదానందం, ప్రొఫెసర్ చిట్టేడి కృష్ణారెడ్డి, ప్రొఫెసర్ రమణమూర్తి, దయాకర్, యాదగిరి పాల్గొన్నారు.
రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులకు దాదాపు రూ.20 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావా ల్సి ఉన్నదని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ చెప్పారు. దేశంలో ఏ రా ష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ప్రతి సంవత్సరం బడ్జెట్, సబ్‌ప్లాన్ కలిపి ఎస్సీలకు దాదాపు రూ.75 వేల కోట్ల కేటాయిస్తున్నప్పటికీ వారు ఎందుకు అభివృద్ధి చెంద డం లేదని సీపీఎం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ప్రశ్నించారు. పన్నేతర రాబడులపై ప్రభుత్వం వేసిన అంచనాలో సగం కూడా రా కపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతోపాటు వ్యవసాయం, గ్రామ పంచాయతీలకు నిధుల్లో కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
గత బడ్జెట్లో రూ.71 వేల కోట్లు ఖర్చు చేయలేకపోయారని, అయినప్పటికీ ఈసారి అంచనా పెంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని రాజకీయ, సామాజిక విశ్లేషకుడు డీ పాపారావు గుర్తుచేశారు. ఆ లోటును ఏవిధంగా పూడ్చుతారో, రాష్ట్ర రాబడిని ఎలా పెంచుతారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. ప్రాధాన్యతల ప్రకారంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని సూచించారు.
విద్య, వైద్య రంగాలకు నిధులను భారీగా పెంచాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అభిప్రాయపడ్డారు. నిధులు కేటాయించినప్పటికీ వాటిని ఖర్చు చేయకపో తే లాభం ఏమిటని ప్రశ్నించారు. గ్రామీణ, నగర ప్రజల ఆకాంక్షలు, అవసరాలు వేర్వేరు గా ఉంటాయని, తదనుగుణంగా నిధులు కే టాయింపు జరగాలని స్పష్టం చేశారు.
ప్రతి బడ్జెట్లో పద్దులను పెంచడమే తప్ప మూలధన వ్యయం పెరగడం లేదని బీజేపీ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆక్షేపించారు. రాష్ట్ర రాబడిలో మూలధన వ్యయం 32 నుంచి 40 శాతం మేరకు ఉండాలని సూ చించారు. చాలా వర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమకాలంలో కీలకంగా పనిచేసి న బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, మే ధావులు, విద్యావంతులు అం తా కలిసి ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఉ ద్యమ ఆకాంక్షలు నెరవేరేలా చూసేందుకు మా వంతు ప్రయత్నిస్తున్నాం. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టి కి తీసుకెళ్లి పరిషారం కోసం కృషిచేస్తు న్నాం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆ క్రమంలోనే ఇప్పుడు సమావేశాన్ని ఏర్పా టు చేశాం.
-డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్, సమన్వయకర్త తెలంగాణ వికాస సమితి