వరంగల్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రి సీతక్కపై వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి సీతక్క శనివారం హనుమకొండ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖతోపాటు నర్సంపేట, వరంగల్ పశ్చిమ, మహబూబాబాద్, పాలకుర్తి ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, మురళీనాయక్, యశస్వినీరెడ్డి ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు.