బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 11:51:34

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

నిజామాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ ‌ఉప‌ ఎన్నికల‌కు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొన‌సాగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ లు ఆకుల లలిత, రాజేశ్వర్, వీజీగౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, అంతకు ముందు టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డిలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే గంప‌ గోవర్ధన్ తో‌ కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ సరళి కొనసాగేలా చర్యలు చేపట్టారు.logo