నిజామాబాద్ : పార్టీ కార్యకర్తలకు(BRS activists) బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula )అన్నారు. నిజామాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన బీఅర్ఎస్ పార్టీ కార్యకర్త గొడికే రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతడికి పార్టీ సభ్యత్వం ఉండటంతో ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల విలువగల చెక్కును (Insurance check)శుక్రవారం రమేష్ సతీమణి గొడికే రజికు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ప్రమాద వశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండటానికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించారన్నారు. రాష్ట్రంలో 60 లక్షల పైచిలుకు మంది బీఅర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని, బలమైన కార్యకర్తలు గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. బీమా కోసం దాదాపు 11 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కార్యకర్తల కోసం చెల్లిస్తున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఇంట్లో కుటుంబ పెద్దను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చెక్కుతో ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుందని పేర్కొన్నారు.