మోర్తాడ్, జనవరి 20: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పిండని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు నిరసనగా ఈ దఫా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీని బహిష్కరిస్తున్నట్టు సోమవారం ఆయన కలెక్టర్‌కు లేఖ రాశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తానని రేవంత్‌రెడ్డి మాట ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా బంగారం ఇవ్వక మాట తప్పినందుకు నిరసనగా చెక్కు ల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.