నర్సాపూర్, జనవరి 16 : అసమర్థ పాలనతో కాంగ్రెస్ సర్కారు తెలంగాణతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని నర్సాపూర్ ఎమ్మెల్మే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని క్యాంప్ కార్యాలయం లో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, రైతుభరోసా, రూ.4 వేల పెన్షన్, తులం బంగారం అమలు చేయాలని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. ఈ-కారు రేస్‌పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దామంటే ప్రభుత్వం పారిపోయిందని, కేటీఆర్‌పై అక్రమంగా ఫార్ములా ఈ-రేసింగ్ కేసు పెట్టారని ధ్వజమెత్తారు.