జగిత్యాల, అక్టోబర్ 23 : ‘మా జీన్స్‌లోనే కాంగ్రెస్ ఉంది. స్వాతంత్య్రం రాకముందు నుంచి మా ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది’ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో కాంగ్రెస్‌లో చేరినట్టు చెప్పారు. అలాగని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో జరిగిన గంగారెడ్డి హత్య కేసుతో తనకేం సంబంధం లేదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కావాలనే తన హస్తం ఉన్నదన్నట్టుగా కొందరితో మాట్లాడించడం సరికాదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు జీవన్‌రెడ్డికి లేదని అన్నారు.