కంఠేశ్వర్, సెప్టెంబర్ 28: నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఎంపీ అర్వింద్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన దిశా సమావేశంలో రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 4నెలల నుంచి ఇన్చార్జి మంత్రి జిల్లాకు రాకపోతే అభివృ ద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
మంత్రి జిల్లాను పట్టించుకోకపోవడం తో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఆయన ఇలాగే వ్యవహరిస్తే సచివాలయంలోని మంత్రి పేషీని పెట్రోల్ పోసి తగులబెడతానని సంచలన వ్యా ఖ్యలు చేశారు. దిశ కమిటీ చైర్మన్ ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డిపై సెటైర్లు వేశారు.
జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సుదర్శన్‌రెడ్డి మంత్రి పదవి రాలేదని అలిగి కూర్చున్నాడని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి.. సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేయండి. ఆయన పని ఆయన చేసుకుంటాడు. లేకుంటే అలిగి కూర్చుంటాడు’ అని వ్యాఖ్యానించారు.