హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ) : ఎట్టిపరిస్థితుల్లో తాను తిరిగి బీజేపీలోకి వెళ్లనని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కుండబద్దలు కొట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల పార్టీకి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రామచందర్రావు మంచి రైటర్ అని, కానీ పార్టీకి కావాల్సింది మంచి ఫైటర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎంపిక చారిత్రక తప్పిదమన్నారు.