ఆదిలాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్న 2 వేల ఎకరాల భూ సేకరణలో జరుగుతున్న అక్రమాలపై ‘తనఖా భూముల్లో అనకొండలు’ శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో వార్తను ప్రచురించడం రాజకీయవర్గాల్లో పెనుదుమారం రేపింది. దీంతో ఈ భారీ భూ కుంభకోణంలో కీలకంగా మారి న ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందిస్తూ ఆ దిలాబాద్లో గురువారం ప్రెస్మీట్ నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత భూమిని ఏడాదిన్నర క్రితం అమ్మేశానని, దాన్ని వేరే వాళ్లు కొనుగోలు చేశారని తెలిపారు. ఏదో చేయాలనే ఆలోచన ఉంటే తన పేరుపై ఉన్న భూమిని ఎందు కు అమ్ముకుంటానని ప్రశ్నించారు. ‘నేను 20 ఏండ్ల క్రితం కొన్న భూమిని ఏడాదిన్నర కిందట వేరే వాళ్లకు అమ్ముకుంటే.. దానిలో ఏదో మతలబు ఉందంటున్నారు.
కొనుగోలు చేస్తే మతలబు ఉంటది కా నీ, అమ్ముకుంటే ఏం ఉంటది?’ అని ఎ దురు ప్రశ్నించారు. అయితే, ప్రెస్మీట్లో చెప్పిన విషయాలను లోతుగా విశ్లేషిస్తే, పలు ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. బ్యాంకులో తనఖా ఉన్న భూములను అసలు ఎలా కొనుగోలు చేశారు? ఆయన కొన్నారంటే, అసలు అవి తనఖా భూ ములా.. కాదా? అనేది ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వలేదు. పైపెచ్చు ఏడాదిన్నర క్రితమే ఆ భూముల ను విక్రయించినట్టు చెప్పారు. ఈ లెక్కన ఆయన తనఖా భూములను కొన్నారా? లేదా? తనఖా భూములు ఎలా ఆయన పేరుపైకి వచ్చాయి? వాటిని తిరిగి ఎలా కొన్నారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బ్యాంకుల్లో ఆ భూములు త నఖా ఉన్నాయని ఎమ్మెల్యేకు తెలియదా? ఎన్సీఎల్టీ ద్వారా వేలం వేస్తే బెంగళూ రు కంపెనీ ఆ భూ ములను దక్కించుకున్న విషయం ఎమ్మె ల్యే దృష్టికి రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. వేలంలో దక్కించుకున్న కంపెనీకి కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అప్పగించి, రె వెన్యూ రికార్డుల్లో రైతుల పేర్లపై ఉన్న భూ ములను తిరిగి వేరే వాళ్ల పేరుపైకి మార్చారని, వాటినే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ కు అప్పగిస్తున్నది ని జమా? అబద్ధమా? అనే ప్రశ్నలకు సమాధానం లేకపోవడం చర్చనీయాంశమైంది. ప్రెస్మీట్లో కేవ లం రాజకీయ ఆ రోపణలకే పరిమితమైన శంకర్.. అసలు ప్రశ్నలను దాటవేయడం అనుమానాలకు తావిస్తున్నది.