కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 16: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజల పక్షాన నిలదీస్తున్నందుకే ఎలాంటి అవినీతి లేకున్నా మాజీ మంత్రి కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
గురువారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రేస్ విషయంలో ఆనాటి ప్రభు త్వం పంపిన నగదు అందిందని ఫార్ములా రేస్ కంపెనీ కూడా చెప్పిందని తెలిపారు. అస లు అవినీతే జరగనప్పుడు కేసు ఎలా పెడుతారని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును అరెస్టు చేసి రాష్ర్టాన్ని దోచుకోవాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయారని, అందుకే ఏ పార్టీ అని నిలదీశానని పేర్కొన్నారు.