కేసముద్రం, అక్టోబర్ 25 : బీఆర్ఎస్ వారికి పనులు అప్పగిస్తే తాట తీస్తానని ఎమ్మెల్యే మురళీనాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఆర్ఏఈ మండలానికి వచ్చిన పనులను వివరిస్తుండగా ఎమ్మెల్యే స్పందించి ఇంకుడు గుంతలకు సంబంధించిన పనులను కాంగ్రెస్ వాళ్లకు కాకుండా బీఆర్ఎస్ వాళ్లకు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ వారికి పనులు ఇస్తే తాట తీస్తా అని బెదిరించడంతో అక్కడ ఉన్నవారు అవాక్కయ్యారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.