జడ్చర్ల, మే 26 : డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని 17, 20వ వార్డుల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటింటి సర్వేలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
జడ్చర్ల నియోజకర్గంలో మొత్తం 2 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, వీటిని కేటాయించేందుకు లబ్ధిదారులను ఎంపిక కోసం సర్వే చేస్తున్నట్టు చెప్పారు.