హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తేతెలంగాణ): శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్ పనుల్లో జియోలాజికల్ సర్వే అధికారులు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రమాదంలో చికుకున్న ఎనిమిదిమందిని క్షేమంగా బయటికి తీసుకురావడానికి వెంటనే చర్యలను చేపట్టాలని కోరారు.
ఊటనీరు రిజర్వాయర్లోకి రాకుండా కట్టడి చేయాలని ఆయన కోరారు. ఇంజినీరింగ్ నిపుణుల సలహాలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. టన్నెల్ లోపల ఎప్పుడూ ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచడంతోపాటు.. ఘటనపై నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.