కుమ్రం భీం ఆసిఫాబాద్ : కరువు కాలంలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం (Compensation) చెల్లించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova lakshm) డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతు సమస్యలను పరిష్కరించ డంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయక సతమతమవుతోందని విమర్శించారు.
పంట సాగుకు నీరు అందక ఎండిపోయిన పంటలను(Dry crops) గుర్తించి ఎకరానికి 25 వేల రూపాయలు అందించాలని, ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు పండించిన పంటలకు రూ.500 బోనస్ ప్రకటిస్తామని, రైతుబంధు కింద ఎకరానికి కౌలు రైతులకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అందించలేదని దుయ్యాపట్టారు.
అదేవిధంగా రైతుల కోసం నూతనంగా ఏ పథకాన్ని ప్రారంభించలేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగాలు ఇస్తోందని అరోపించారు. అబద్ధపు ప్రచారాలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
అంతకుముందు బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతులకు పంట నష్టం,పంటల పై బోనస్ ప్రకటిం చాలనే డిమాండ్ల తో ఎమ్మెల్యే తో పాటు పార్టీ నాయకులు కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జడ్పిటిసి అరిగేలా నాగేశ్వరరావు, నాయకులు సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.