తెలంగాణ రాష్ట్ర సర్కారు అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన స్వశక్తి గ్రూపు మహిళల సాధారణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ, స్వయంఉపాధి పథకాల్లో నియోజకవర్గ మహిళలు శిక్షణ తీసుకోవాలని సూచించారు. అనంతరం వ్యక్తిగతంగాగానీ, సామూహికంగానీ కుటీర, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. ఉత్పత్తులను ఎగుమతి చేసి మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.