అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లోకి వలసలు : ఎమ్మెల్యే కొప్పుల
ఎమ్మెల్యే కొప్పుల | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

వికారాబాద్/పరిగి: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని తన నివాసంలో దోమ మండలం బొంపల్లి ఎంపీటీసీ, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు రాఘవాపూర్ రాములు, మాజీ సర్పంచ్ మాన్యానాయక్, మాజీ ఉపసర్పంచ్ శంకర్‌నాయక్, నాయకులు రంజానాయక్, దేవులానాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే ఏ ఎన్నికలైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు సబ్బండవర్ణాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో దోమ జెడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాఘవేందర్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు హరిశ్చందర్, డాక్యనాయక్, ఖాజాపాషా, రఫిక్, షేర్‌ఖాన్, బొంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్రం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

