Jagadish Reddy | తెలంగాణలో ప్రభుత్వమే గుండాగిరికి పాల్పడుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వద్ద పోలీసులు చేసిన దాడిపై ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్ దగ్గర, మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీకి వెళ్తున్న మమ్మల్ని రాష్ట్ర పోలీసులే అడ్డగించి దాడి చేసి, మా మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు.
కేసీఆర్ ఇంటి మీదకు దాడి చేయడానికి రేవంత్ రెడ్డే పోలీస్ ఎస్కార్ట్‌ను ఇచ్చి వేలాది మంది గూండాలను పంపించాడు. AI జనరేటెడ్ ఫొటోలను చేసి మా నాయకుల మీద 4 కేసులు పెట్టారు. మా మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసి తిరిగి వారి మీదనే కేసులు పెట్టారు. వీటన్నిటికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ దగ్గర, మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చామన్నారు.