నల్లగొండ : దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ నాయక్ (Kanilal Naik) తండ్రి పార్థివ దేహానికి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
కనిలాల్ నాయక్ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. హైదరాబాద్లోని నిమ్స్ (NIMS) హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కనిలాల్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రవీంద్ర కుమార్ను ఓదార్చారు.