Jagadish Reddy : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, అణచివేతను తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తగ్గేదేలే అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy).. పోరాటమే నా ఊపిరంటూ మళ్లీ కదనరంగంలోకి దిగారు. ప్రభుత్వ అణచివేతలను ఎదుర్కోవడం తమకు కొత్త కాదని జగదీశ్ రెడ్డి మరోసారి నిరూపించారు.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ప్రధాన గేటు వద్ద పోలీసుల దాడిలో గాయపడిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మళ్లీ పోరుబాట పట్టారు. సోమవారం నిమ్స్‌లో చికిత్స పొందిన ఆయన.. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఈరోజు ఓ యోధుడిలా కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలపై పోలీసులు దాడికి నిరసనగా అంగి జేబుకు నల్ల బ్యాడ్జీతో దారిపొడవునా బీఆర్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులకు అభివాదం చేస్తూ కదిలారు. గుండె ధైర్యంతో అడుగేస్తూ.. ప్రజల పక్షాన కొట్లాడే గులాబా సైనికులకు అక్రమ అరెస్టులు, ప్రభుత్వ అణచివేతలను ఎదుర్కోవడం తమకు కొత్త కాదని జగదీశ్ రెడ్డి మరోసారి నిరూపించారు.
అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహం, దాష్టీకం వల్ల అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు. pic.twitter.com/0KwRxH2eg0
— Jagadish Reddy G (@jagadishBRS) September 7, 2026