సంగారెడ్డి, జనవరి 14 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట: దక్షిణాదిలో సిద్దిపేట పట్టణానికి క్లీన్‌సిటీ అవార్డు వస్తే అభినందనలు తెలుపని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటకు అవార్డు వచ్చినందుకు ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలోనే పరిశుభ్రమైన పట్టణంగా సిద్దిపేట నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో ఎకడ అవార్డు వచ్చినా కేసీఆర్ సర్కార్ పిలిచి అభినందించేదని గుర్తుచేశారు. 2023లో దేశంలో 4,416 మున్సిపాలిటీల్లో 9వ స్థానంలో హైదరాబాద్ నిలిస్తే, దక్షిణాదిలో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచిందని అన్నా రు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందన ట్వీట్, ప్రెస్‌నోట్‌కు కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రశంసించకపోయినా తమకు ప్రజ ల ఆశీస్సులు ఉన్నాయని హరీశ్‌రావు అన్నా రు. అనంతరం ఆయన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి స్వర్ణాభరణ అలంకరణ ఉత్సవాల్లో పాల్గొన్నారు. న్యాల్కల్ మండలం రేజింతల్‌లోని సిద్ధివినాయక స్వామి జయంత్యుత్సవాల్లో పాల్గొని మొక్కు లు చెల్లించుకున్నారు. ఆ తర్వాత జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకుడు ఖిజర్ యాఫై నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైన ల్ పోటీకి హాజరై గెలుపొందిన సంగారెడ్డి జట్టుకు ట్రోఫీని అందజేశారు.