ఔట్సోర్సింగ్ పెండింగ్ జీతాలు చెల్లించాలి
ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
సిద్దిపేట కలెక్టరేట్, జూలై 19: ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నారని, పీఎఫ్ డబ్బులు కూడా జమ కావడం లేదని తెలిపారు.
ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలకు పరిష్కారం చూపాలని, 7 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

