కామారెడ్డి : అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పెద్ద ఎత్తున పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)దేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Mla Goverdhan) అన్నారు.కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, రామారెడ్డి మండలాలకు చెందిన 668 మంది లబ్ధిదారులకు 1,668 ఎకరాల పోడు భూములకు ఆదివారం పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో పాలకులు గిరిజనులను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. గిరిజనులను ఓటు బ్యాంకు(Vote Bank) రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నారని, వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడడం వల్ల తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయం పాలనను పాలించుకునే విధంగా గౌరవం కల్పించారని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో 3 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తే, ప్రస్తుతం 4 లక్షల 6 వేల ఎకరాలకు పట్టాలు ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బీఆర్ఎస్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.