కరీంనగర్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalkar) అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్లోని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు(tribute). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డా.బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించారన్నారు.
రిజర్వు బ్యాంక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి దేశ స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాదులు వేశారని గుర్తు చేశారు. అలాగే అనేక ఉద్యమాలు చేసి సామాజిక న్యాయం అలుపెరుగని పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడిన బహుముఖ ప్రజ్ఞశాలి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునిల్ రావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.