హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని కాంగ్రెస్‌కు పాడె గట్టే యాత్ర అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు రేవంత్ రెడ్డిని బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు. ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్‌రావు, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్, రాజకీయ వ్యభిచారి, బ్రోకర్ అంటూ విరుచుకుపడ్డారు. సచివాలయం, అమరవీరుల స్మారక కేంద్రం, అంబేదర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి అంటూ ఆధారాలు రేవంత్ మాట్లాడుతున్నారని అన్నారు. ఇలా నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు, సమాజం సహించదని, చెప్పులతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
సమాచార హకు చట్టాన్ని బ్లాక్‌మెయిలింగ్‌కు వాడుకొనే రేవంత్, ఇప్పుడు కూడా వాటి గురించి సమాచారం తీసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే హకు రేవంత్‌కు లేదని మండిపడ్డారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొనకుండా రెండు కండ్ల చంద్రబాబు సంకలో దూరిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. పెయింటర్‌గా జీవితం ప్రారంభించిన రేవంత్‌కు ఇన్ని ఆస్తులు ఎకడివని నిలదీశారు. ‘మంత్రి ప్రశాంత్‌రెడ్డిని అవినీతిపరుడని విమర్శిస్తావా? ప్రశాంత్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి గురించి నిజామాబాద్ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు’ అని అన్నారు. కేసీఆర్ పాలనలో అవినీతికి చోటే లేదని స్పష్టంచేశారు. రేవంత్ పిచ్చి ప్రేలాపనలు మానకపోతే తన్ని తరిమేస్తారని హెచ్చరించారు. రేవంత్‌ను మించిన పొలిటికల్ బ్రోకర్ ఎవరూ లేరని చెప్పారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.
రేవంత్‌కు జైలే సరైన స్థలం: రాజేశ్వర్‌రావు
దేశానికి ఎవరు వచ్చినా తెలంగాణనే ముందు సందర్శిస్తున్నారని, రాష్ర్టాన్ని ఆదర్శంగా మార్చామని ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్‌రావు అన్నారు. రేవంత్ వ్యాఖ్యలు విని అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, ప్రశాంత్‌రెడ్డి కాలిగోటికి కూడా రేవంత్ సరిపోడని మండిపడ్డారు. అమర వీరుల స్మారక కేంద్రం నిర్మాణ వ్యయం పెరగడానికి స్టీల్, సిమెంట్ రేట్లు పెరగడమే కారణమని చెప్పారు. సచివాలయానికి ఇప్పటి వరకు 470 కోట్ల మాత్రమే ఖర్చయ్యిందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి బుద్ధి, జ్ఞానం లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటుకు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌కు జైలులో చిప్ప కూడే గతి అన్నారు.