జగిత్యాల రూరల్, నవంబర్ 19 : తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పదుల సంఖ్యలో మహిళలు, పురుషులు గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
ఇండ్ల కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదని, అడిగీఅడిగి అలసిపోయామని క్యాంపు ఆఫీస్ వద్దే చచ్చిపోతామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.