చిన్నంబావి, జూలై 11: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు పెడుతుంటే.. వాటికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొస్తున్నారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు.
మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం గూడెం, కొప్పునూరు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు 50 మంది గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.