MLA Arekapudi Gandhi | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి సవాల్ విసురుతూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడిన బూతులు విమర్శలకు దారితీస్తోంది. గాంధీ మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. ‘నా మీద సవాల్ విసిరిన బ్రోకర్ కౌశిక్రెడ్డిగా.. ధైర్యముంటే రా నా కొడకా.. 11 గంటలకు నువ్వు రాకపోతే నేనే 12 గంటలకు నేనే వస్తా.. బ్రోకర్ లం..కొడకా.. నువ్వో నేనో తేల్చుకుందాం రా బాంచెత్..! దేనికైనా సిద్ధం నాకొడకా..! హుజూరాబాద్ నుంచి బతకనీకి వచ్చిన దుర్మార్గుడు నా ఇంటిమీద జెండా ఎగురవేస్తానంటే.. ఎగురేయించుకోవాల్నా.. పోలీసులు.. మీడియా ఆపినా వాడి సంగతి తేలుస్తా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసిన బ్రోకర్ నాకొడుకు.. నామీద సవాల్ విసిరితే నేను చేతగానివాడినా..! ఈ బ్రోకర్నాకొడుకు కోసం పదిరోజులు నా గాంధీ పేరును పక్కన పెట్టి వాడో నేనో తేల్చుకుంటా.. కౌశిక్‌రెడ్డి ఒక బ్రోకర్, ఒక కోవర్టు, దుర్మార్గుడు..! బీఆర్ఎస్ లో బ్రోకర్ లం..కొడుకులు చేరినాక ఆ గౌరవం లేర్లతో సంసారం చేయగలుగుతామా.. అలాంటి ఇంకో ముగ్గురు ఉన్నారు..! దుర్మార్గుల మూలానే ఆ పార్టీ అపోజిషన్‌లో కూర్చుంది. కౌశిక్రెడ్డిలాంటి బ్రోకర్లతో పార్టీకి నష్టమని..ఆంబోతులను మీడియా ముందు వదిలినప్పుడు ఆలోచించుకోవాలని అన్నారు. గాంధీ ఇలా రెచ్చగొట్టే విధంగా మీడియా ముందు మాట్లాడుతుంటే ఆయన అనుచరులు రెచ్చిపోయి ఏడున్నవ్‌రా కౌశిక్.. దమ్ముంటే రారా నా కొడకా..అంటూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎమ్మెల్యే గాంధీ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ‘హుజూరాబాద్ నుంచి నా నియోజకవర్గానికి బతకనీకి వచ్చావ్’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. ‘హుజూరాబాద్ వేరే దేశంలో ఉందా?.. శేరిలింగంపల్లికి రావాలంటే నీ అనుమతి తీసుకోవాలా?’ అని ప్రశ్నిస్తున్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన వారు శేరిలింగంపల్లిలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారని, వారందరినీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయని బ్రోకనకు ఓట్లేసిన వారిలో కూడా అన్ని ప్రాంతాలవారు ఉన్నారని, అందరినీ బతకనీకి వచ్చినవారే అని అవమానించినట్టేనని చెప్తున్నారు. బేషరతుగా అందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.