హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన అందగత్తెలకు నీరా సేవించే అవకాశం కల్పించడంపై గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ సోమవా రం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ప్రకృతి నుంచి స్వీకరించే నీరా, కల్లు, ముంజల ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.