Miss World Competition | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచ సుందరీ పోటీల తుది ఘట్టం దగ్గరపడింది. ఎల్లుండి హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరగనున్నది. ఆ వేదికపై ప్రపంచ సుందరి కిరీటం ఎవరిని వరించనుందో తేలిపోతుంది. 109 మంది అందాలభామలు ప్రపంచ సుందరీ కిరీటం కోసం తలపడగా, తుది పోటీలకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు.
గ్రాండ్ ఫినాలేలోని ఒక్కో దశలో కొందరిని ఎలిమినేట్ చేస్తూపోయి, తుదివరకు నిలిచిన ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ విజేతలుగా ప్రకటిస్తారు. హైటెక్స్‌లోని 31న జరగనున్న గ్రాండ్ ఫినాలేకు సుమారు 4 వేల మంది అతిథులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మిస్ ఇండియా నందిని గుప్తా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలో ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.