Miss World | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): మిస్వరల్డ్-2025 పోటీలకు తెలంగాణ ముస్తాబైంది. ఈ నెల 10న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించాలనే ఉద్దేశంతో నిర్వహించనున్న ఈ పోటీల్లో 116 దేశాల నుంచి అందాల తారలు పాల్గొననున్నారు. అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆసియా తదితర ఖండాల్లోని వివిధ దేశాలతోపాటు కరీబియన్ దీవులకు చెందిన పలువురు అందగత్తెలు తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించనున్నారు.
అందాల పోటీల షెడ్యూల్ వివరాలు (మే నెల)