మిస్ వరల్డ్ -2025 పోటీల్లో పాల్గొనే ఆసియా ఓసియన్ గ్రూప్ -4 లోని 22 దేశాల అందాల భామలు బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు. హైదరాబాద్ నుంచి బస్సులో నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని విజయవిహార్‌కు చేరుకున్నారు. వారికి నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో అధికారులు స్వాగతం పలికారు.
విజయవిహార్ అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకొని ఫొటో షూట్ అనంతరం సాయంత్రం 6.15గంటలకు బుద్ధవనం చేరుకున్నారు. బుద్ధడి పాదాలకు పుష్పాంజలి ఘటించి, మహాస్థూపం ఎదుట ఫొటోలు దిగారు. మహా స్థూపంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన బుద్ధవనం విశేషాలను వారికి పురావస్తు నిపుణులు ఈమని శివనాగిరెడ్డి వివరించారు.
జాతక పార్కులో బుద్ధ చరితంపై కళాకారులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించి రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇక్కడ ఐజీ సత్యనారాయణ, ప్రత్యేకాధికారి లక్ష్మి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
– నందికొండ