హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా మైనార్టీలంతా టీఆర్ఎస్ పక్షాన ఉంటారని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్ తెలిపారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గం బంగారిగడ్డలో ఉప ఎన్నికల్లో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని అన్నారు.
పేదల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు నేటివరకు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు తెలంగాణలో ఆదరణ లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. ఈ ప్రచారంలో టీఆర్ఎస్ మైనార్టీ రాష్ట్ర నాయకుడు ఎంకె బద్రుద్దీన్, నాయకులు పాల్గొన్నారు.