Transfers | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతోపాటు కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శనివారం జీవో-1167 జారీచేశారు. గనులశాఖ డైరెక్టర్‌గా కే సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. భూసేకరణ, పునరావాస కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చింది.
మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయేషా మస్రత్‌ను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా తఫ్సీర్ ఇక్బాల్, మైనార్టీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండీగా నిర్మలా కాంతి వెస్లీకి అదనపు బాధ్యతలు ఇవ్వగా.. వక్ఫ్‌బోర్డ్ సీఈవోగా మహ్మద్ అసదుల్లా నియమితులయ్యారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా జీ మల్సూర్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వగా.. ఖమ్మం అదనపు కలెక్టర్ (లోకల్‌బాడీ)గా శ్రీజను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.