ఢిల్లీ : మహాత్మా జ్యోతిబా పూలే 196 జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పూలే చిత్ర పటానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..హాత్మా జ్యోతిబా పూలే దేశంలోనే అసమానతలకు వ్యతిరేకంగా సమాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కుల, లింగ, బేధ వివక్షలపై జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. నేటి యువత ఆ మహనీయుడి బాటలో నడువాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.