హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి వార్త తమను ఎంతో కలచి వేసిందని పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, బొజ్జల గుండెపోటుతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.