బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ అమ్మకానికే.. : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలంలోనూ కరెంటు కష్టాలు లేవని, 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు ఒక్క చెక్ డ్యామ్ నిర్మించలేదని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో 15 చెక్‌డ్యామ్‌లు కట్టామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారున్న కర్నాటకలో పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు.

కర్ణాటకలో రూ.1400కు క్వింటాల్ వడ్లు కొంటే.. తెలంగాణలో రూ.1920కి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కర్నాటక రైతులు రాష్ట్రానికి ధాన్యం తెచ్చి అమ్ముకుంటున్నారన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు కర్నాటకలో లేవన్నారు. వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. రైతులు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలను మోసం చేయడమే తెలుసునని ఆరోపించారు. బీజేపీకి గుజరాత్ తప్ప మరో ఆలోచన లేదన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్‌కు మూటలు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు.


పార్లమెంట్లో ఇచ్చిన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమైందని, తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ వెళ్లిందన్నారు. ఆర్థిక సంఘం నివేదికను కేంద్రం తొక్కిపెట్టిందని, తెలంగాణకు రూ.9వేలకోట్ల ఎగనామం పెట్టిందని, నీతి ఆయోగ్ సూచనలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ గుండెచప్పుడు కేసీఆర్ అన్నారు. నర్సాపూర్‌లో త్వరలో టూరిస్ట్ హబ్, పీజీ కాలేజీకి పక్కా భవనం నిర్మిస్తామన్నారు. రూ.35కోట్లు మంజూరు చేశామని, మల్లన్నసాగర్ నీళ్లు నర్సాపూర్ వస్తాయని, కాలంతో పని లేకుండా నీళ్లు వచ్చేలా చేస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitin Nabin | రాహుల్‌గాంధీకి దేశాభివృద్ధి కాదు.. తన కుటుంబ అభివృద్ధే కావాలి : నితిన్ నబీన్
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Dimple Hayathi | నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్‌కు డింపుల్ హయాతి రిప్లై
Crime News | రూ.1.25 కోట్ల భూమి కోసం గొడవ.. డాక్టర్ దారుణ హత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

