Yadadri Narasimhaswamy | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణానికి రాష్ట్ర మంత్రులు గైర్హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, నల్లగొండ ఇన్చార్జి మంత్రి హాజరుకాలేదు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారని దేవాలయ అధికారులు ఎదురుచూసినా నిరాశే మిగిలింది. చివరి క్షణంలో ఆయన హాజరు కావడం లేదని తేలడంతో స్వామి వారి ఉత్సవాన్ని మంత్రులు రాకుండానే జరిపించారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను స్వామి వారికి దేవాదాయ శాఖమంత్రి అందజేయాల్సి ఉంది. కానీ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అందజేశారు.
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున మంత్రులు హాజరు కావడం ఆనవాయతీగా వస్తున్నది. కానీ ఈ ఏడాది మంత్రులు లేకుండానే స్వామి వారి కళ్యాణోత్సవం జరగడంతో మంత్రుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.