హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): అధునాతన హంగులతో ప్రపంచమే అబ్బురపడేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని నిర్మించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నూతన సెక్రటేరియట్‌కు సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్‌ను ఐదున్నర గంటలపాటు మంత్రి సందర్శించారు. సచివాలయం ప్రాంగణమంతా కలియ తిరిగి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మినిస్టర్ చాంబర్స్, మంత్రుల పేషీలు, కాన్ఫరెన్స్ హాల్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ చాంబర్స్, సెక్షన్ ఆఫీసర్స్, క్లస్టర్డ్ వర్స్ స్టేషన్స్ వంటి పనులను చూశారు. ఈ సందర్భంగా అధికారులు, వర్ ఏజెన్సీకి, ఆరిటెక్ట్లకు పలు సూచనలు చేశారు. అనంతరం వేముల మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించే ప్రాంతం విశాలంగా, సకల సౌకర్యాలతో ఉండాలని, అప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిపాలనా పరమైన పనులు వేగవంతంగా జరుగుతాయనే దూరదృష్టితో సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌ను అధునాతన హంగులతో నిర్మించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్లో ఉన్న వర్ ప్లేస్ కంటే నూతన సెక్రటేరియట్ వర్స్ ప్లేస్ ఎకువ అని చెప్పారు. ఇది తెలంగాణకు ప్రతీకగా నిలిచిపోనుందని ఆనందం వ్యక్తంచేశారు. సీఎం విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని అధికారులకు, వర్ ఏజెన్సీకి మంత్రి ఆదేశించారు.