చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 20: టీఆర్ఎస్ను గెలువలేకనే ఈసీనీ అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం డీ నాగారం, దామెరలో గురువారం ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. గతంలో గెలిచి నాలుగేండ్లయినా ఒక్క అభివృద్ధి పని కూడా చేయని రాజగోపాల్‌రెడ్డి ఒక్క ఏడాదిలో ఎలా చేస్తారని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తారని పేర్కొన్నారు. దామెర గ్రామవార్డు సభ్యురాలు సాతిరి రజితతో పాటు రెండు గ్రామాలకు చెందిన 100 మంది నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రాజగోపాల్‌రెడ్డి స్వార్థంతోనే ఉప ఎన్నిక వచ్చిందని, అంతేకానీ ప్రజల బాగుకోసం కాదని మండిపడ్డారు. స్థానిక సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.