మక్తల్, మే 6 : మంత్రి వాకిటి శ్రీహరి కాన్వాయ్‌లోని వాహనం బోల్తాపడిన ఘట న నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం.. ఊటూరు మండలం మల్లేపల్లిలో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్‌లోని బాంబు స్వాడ్ వాహనం ఉప్పర్‌పల్లి స్టేజీ సమీపంలో బైక్‌ను తప్పించబోయి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బందికి గాయాలు కావడంతో వారిని మంత్రి ఆదేశాలతో జిల్లా దవాఖానకు తరలించారు.