Telangana | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు లు, మిత్తీల భారాన్ని తగ్గించుకొని, భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వాలపై రుణభారాన్ని మోపేందుకు సిద్ధమైంది. ఈ మేర కు నీటిపారుదల రంగంలో ప్రస్తుత అప్పులను దీర్ఘకాలిక రుణాలుగా మార్చాలని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్వల్పకాలిక రుణాలతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నదని, దీర్ఘకాలిక రుణాలతో ఈఎంఐతోపాటు వడ్డీ చెల్లింపుల్లో వెసులుబాటు లభిస్తున్నదని చెప్పారు.అందుకే ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
మంగళవారం జలసౌధలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖకు ప్రస్తు తం ఉన్న స్వల్ప కాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని తెలిపారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్‌లకు కొత్త విధానం వర్తింపజేయాలని బ్యాంక్ ప్రతినిధులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహదారు ఆదిత్యనాథ్ దాస్,కార్యదర్శి రాహు ల్ బొజ్జ, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్సీ కే శ్రీనివాస్, బ్యాంక్ ప్రతినిధులు సంగ్మా కిమ్, రాజేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.