హైదరాబాద్, జూన్14 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్ఆర్)ను తక్షణమే తిరసరించాలని కోరుతూ కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. జీబీ లింక్ ప్రాజెక్టు డీపీఆర్‌ను అడ్డుకోవడంతోపాటు, ఏపీ చేపట్టనున్న టెండర్ల ప్రక్రియను కూడా అడ్డుకోవాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దకాల్సిన గోదావరి నదీ జలాల వాటా హకును ఇది ప్రత్యక్షంగా ధికరించడమే అవుతుందని పేర్కొన్నారు. జూన్ 2న నిర్వహించిన సమావేశంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్యాదవ్ చేసిన సూచనలను బట్టి అప్పటికే పీఎఫ్ఆర్ను ఆమోదించినట్టు భావించాల్సి వస్తున్నదని తెలిపారు.
డీపీఆర్ సమర్పించడమంటే కేంద్ర జల వనరుల సంఘం ఆమోదించినట్టు అవుతుందా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. నిధుల కోసం కేంద్రాన్ని ఏపీ ఒత్తిడి చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. కేంద్ర జలవనరుల సంఘంతోపాటు గోదావరి-కృష్ణా రివర్ బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగుతున్నదని మండిపడ్డారు. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం 1,486 టీఎంసీల్లో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని, ఆ నీటి వాటాకు కేంద్ర జల వనరుల సంఘం, జీఆర్ఎంబీ ఆమోదం కోసం వేచి చూస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదిస్తుందని ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించే నైతికత ఏపీకి ఎకడిదని నిలదీశారు. వాస్తవానికి ట్రిబ్యునల్‌లో వరద నీరనే ప్రస్తావనే లేదని తేల్చిచెప్పారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ప్రాంతాన్ని గందరగోళంలోకి నెట్టి వేస్తున్నాయని, నిబంధనల ప్రకారం బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై జోక్యం చేసుకుని టెండర్ల ప్రక్రియను నిలువరించాలని మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపోరాటానికి సిద్ధమవుతామని మంత్రి హెచ్చరించారు.
హరీశ్‌రావు నిలదీతతోనే ఉత్తమ్ లేఖ
జీబీ లింక్ ప్రాజెక్టుపై మాజీమంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దునుమాడారు. బనకచర్లపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీయడంతోపాటు, రేవంత్ సర్కారు స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. హరీశ్‌రావు ప్రెస్‌మీట్‌తో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హరీశ్‌రావు సమావేశం ముగిసిందో లేదో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. కేంద్రజల్‌శక్తిశాఖ మంత్రికి రాసిన లేఖను హడావుడిగా మీడియాకు విడుదల చేశారు. దీనిపై మాజీమంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినందుకైనా జల్‌శక్తి శాఖ మంత్రికి లేఖ రాసి విడుదల చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ప్రెస్‌మీట్ పెట్టిన సందర్భంలోనూ బ్యాక్ డేట్ వేసి మీడియాకు లేఖ విడుదల చేసిన సంగతిని గుర్తుచేశారు. లేఖలు రాసి మీడియాకు ఇవ్వడం కాకుండా, చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రిని బనకచర్ల విషయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు డిమాండ్ చేయమనాలని ఎక్స్‌వేదికగా హరీశ్‌రావు డిమాండ్ చేశారు.