హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ మూడేండ్లలో పూర్తి చేస్తామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే నీటినిల్వ సామర్థ్యం లేకుండా పోయిందని పేర్కొన్నారు.