హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): చేతికొచ్చిన పంటను కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. నీటిపారుదల శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ, విద్యుత్తు శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మరో 15 రోజుల్లో పంట చేతికి రానుండడంతో అధికారులు రైతులకు తోడ్పాటునందించాలని సూచించారు.