Uttam Kumar Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను క్షమాపణలు కోరారు. కృష్ణా నీటి వినియోగంపై అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఉత్తమ్ తరుచూ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. రెండుమూడు సార్లు ఇదే తరహాలో ఉత్తమ్ ప్రసంగం సాగింది.
దీంతో కల్పించుకున్న స్పీకర్.. ‘స్పీకర్‌నుద్దేశించి మాట్లాడాలే కానీ.. సభ్యులనుద్దేశించి మాట్లాడరాదు’ అని ఉత్తమ్‌కు సూచించారు. దీంతో ‘సారీ సార్’ అంటూ క్షమాపణలు కోరి ప్రసంగాన్ని కొనసాగించారు.