హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులకు సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులపై ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ రాహుల్‌బొజ్జాతో కలిసి ఉన్నతాధికారులతో గురువారం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులపై ఆరా తీశారు.
అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాలు వచ్చేలోగా పనులను పూర్తిచేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శిస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఇరిగేషన్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు, ఎల్అండ్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.