Tummala Nageswara Rao | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఒక్కో ఇంటికి రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని, దానినే అమలు చేశామని అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరావు ప్రకటించారు. పద్దుల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోకపోయినా మంత్రులు హెలికాప్టర్ల నుంచి దిగడమే లేదని, ఎందుకంత దుబారా చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం రూ.49 వేల కోట్ల మేరకు రైతు రుణమాఫీ చేస్తుందేమో అనుకున్నామని, కేవలం రూ.20 వేల కోట్లు అని అంటున్నారని నిలదీశారు. దీంతో మంత్రి తుమ్మల స్పందిస్తూ రూ.20 వేల కోట్లను ఈరోజు వరకు రుణమాఫీ కింద రిలీజ్ చేశామని తెలిపారు. రూ.33 వేల కోట్ల రైతు భరోసాను ఈ నెలాఖరులో జమ చేస్తామని తెలిపారు.